Breaking News కథనాలు

*వైద్య నారాయణ హరి .. డాక్టర్స్ డే సందర్భంగా మీడియాతో చాట్.

135 Views

ఆదర్శ వైద్యుడు డాక్టర్,జి.సురేంద్రబాబు

ప్రతిభ అవార్డుతో సత్కరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు* వృత్తి డాక్టర్ – ప్రవృత్తి సామాజిక సేవ…..
<ప్రభుత్వ పాఠశాలలో చదివి హైదరాబాద్ లోని ప్రముఖ వైద్య కళాశాల ఉస్మానియా లో MBBS సీటు సంపాదించారుతల్లిదండ్రులైన రత్నమ్మ, రమణ గార్లు వ్యవసాయ కూలీ పని చేసుకునే నిరుపేదలుతల్లిదండ్రులకి భారం కాకుండా సొంతంగా హోమ్ ట్యూషన్లు చెప్పుకుంటూ కాలేజీల్లో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ MBBS ను పూర్తి చేశారుదేశంలోనే అత్యంత ప్రముఖమైన చండీగఢ్ లోని PGI ఇన్స్టిట్యూట్ లో MD pediatrics సీటు సంపాదించి తన కోర్సు పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాని ఎంచుకుని "అమృత పిల్లల హాస్పిటల్" స్థాపించి అక్కడున్న పేద మరియు మధ్య తరగతి పిల్లలకు తక్కువ ఖర్చుతో వైద్యాన్ని అందిస్తున్నారు* *????స్వామి వివేకానంద స్పూర్తితో "నరేన్ ఫౌండేషన్" అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి ప్రతి సంవత్సరం వివేకానంద జయంతి జనవరి 12 నాడు తన మండల స్థాయిలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి,ప్రతి యేడు వెయ్యి మందికి పైగా రోగులకు వైద్యాన్ని అందించి ఉచిత మందులు ఇస్తున్నారుజయ వారాహి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ పేరు మీద మొత్తం పదకొండు హాస్పిటల్స్ స్థాపించి మూడు వందల మందికి పైగా ఉద్యోగాలిచ్చి వారి జీవితాల్లో మార్పును తీసుకొస్తున్నారు* *డాక్టర్ జి సురేంద్రబాబు గారు అంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లాలో చిన్న కుగ్రామంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులైన రత్నమ్మ, రమణ గార్లు వ్యవసాయ కూలీ పని చేసుకునే నిరుపేదలు. డాక్టర్ గారు తన ప్రాథమిక, ఉన్నత విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో అభ్యసించారు. పదో తరగతిలో తాను సాధించిన ఘనతకు గాను అప్పటి ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిభ అవార్డుతో సత్కరించారు. ఈ అవార్డుకు ఎంపికైన విషయం కూడా తాను గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కరువు పని చేస్తుండగా పోస్టు ద్వారా తెలిసిందంటే తన కుటుంబ దీనస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయి లో ఎమ్సెట్ ర్యాంకు సాధించి హైదరాబాద్ లోని ప్రముఖ వైద్య కళాశాల ఉస్మానియా లో MBBS సీటు సంపాదించారు. అప్పటి నుండి తన కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని తల్లిదండ్రులకి భారం కాకుండా సొంతంగా హోమ్ ట్యూషన్లు చెప్పుకుంటూ కాలేజీల్లో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ MBBS ను పూర్తి చేసి, దేశంలోనే అత్యంత ప్రముఖమైన చండీగఢ్ లోని PGI ఇన్స్టిట్యూట్ లో MD పీడియాట్రిక్ సీటు సంపాదించి తన కోర్సు పూర్తి చేశారు.*నరేన్ ఫౌండేషన్* *తన జీవితం ఒక ముళ్ళ బాట లాంటిది అయినప్పటికీ తన చుట్టూ ఉన్న సమాజానికి సేవ చేయాలనే గొప్ప మనసుతో స్వామి వివేకానంద స్పూర్తితో "నరేన్ ఫౌండేషన్" అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి ప్రతి సంవత్సరం వివేకానంద జయంతి జనవరి 12 నాడు తన మండల స్థాయిలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రతి యేడు వెయ్యి మందికి పైగా రోగులకు వైద్యాన్ని అందించి ఉచిత మందులు ఇస్తున్నారు. దీనితో పాటుగా వివేకానంద జీవితం మరియు స్ఫూర్తి అనే పుస్తకాలను ప్రజలకు అందించి వారి జీవితంలో చైతన్యం, అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నారు జయవారాహి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్:* *MD pediatrics కోర్సు పూర్తి చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల అనే పట్టణాన్ని ఎంచుకుని "అమృత పిల్లల హాస్పిటల్" స్థాపించి అక్కడున్న పేద మరియు మధ్య తరగతి పిల్లలకు తక్కువ ఖర్చుతో వైద్యాన్ని అందిస్తున్నారు. అత్యవసర ఆపరేషన్లు అవసరమైన స్థోమత లేని వారి పిల్లలకి తన సొంత డబ్బులు వెచ్చించి హైదరాబాద్ లోని కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం అందించి తన గొప్ప మనసును చాటుకుంటున్నారు. ప్రతి రోజు విద్యార్థుల్లో జ్ఞాన సముపార్జన ఇవ్వడానికి పాఠశాల నందు అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఎంతో మంది ఉపాధ్యాయుల మరియు తన తోటి వైద్యుల దగ్గర కూడా మన్ననలు పొందుతున్నారు. ఇందులో భాగంగా జయ వారాహి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ పేరు మీద మొత్తం పదకొండు హాస్పిటల్స్ స్థాపించి మూడు వందల మందికి పైగా ఉద్యోగాలిచ్చి వారి జీవితాల్లో మార్పును తీసుకొస్తున్నారు.* *"తన వృతి డాక్టర్ - ప్రవృత్తి సామాజిక సేవ" అనే ధోరణిలో ఎన్నో మంచి పనులు చేస్తూ... డాక్టర్ సురేంద్రబాబు పీడియాట్రిక్...

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *