రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎక్సైజ్ మరియు సివిల్ పోలీసులు సమన్వయంతో పని చేయాలని రాజన్న సిరిసిల్ల యస్పీ అఖిల్ మహజాన్ ఎక్సైజ్ సి.ఐ. ఎం.పి.ఆర్. చంద్రశేఖర్ తెలిపారు. నాటుసారాయి తయారు, రవాణా, సేవించే ప్రాంతాలను గుర్తించి వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. నాటుసారాయికి ఉపయోగించే ముడి పదార్థాలైన బెల్లం మరియు పటిక అమ్మేవారిని ముందే గుర్తించి సంబంధిత తహసీల్దార్ ల ముందు బొండోవర్లు చేయాలన్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చేవారిపై కఠినంగా వ్యవరించాలని ఆదేశించారు. గంజాయి మరియు మత్తు పదార్థాల సేవించే వారిపై మరియు అక్రమ వ్యాపారం చేసేవారిపై రహస్యంగా సమాచారం సేకరించి , పట్టుకుని జైలుక పంపించాలని సమన్వయ సమావేశంలో యస్పీ అఖిలేష్ మహాజన్ ఆదేశించారు.
పై సమన్వయ సమావేశంలో ఎక్సైజ్ సి.ఐ లు సిరిసిల్ల-గులామ్ ముస్తఫా , వేములవాడ – గుండేటి రాము మరియు ఎల్లారెడ్డి పేట – మరాఠీ పోష్ రాజ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
