ముస్తాబాద్,
జనవరి 28 (24/7న్యూస్ ప్రతినిధి): భారతీయ జనతాపార్టీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు చిగురు వెంకన్న కొండాపూర్ గ్రామంలోని ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇప్పటికే 326మందికి లబ్ధిదారులను గుర్తించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందులో మొదటి విడుతగా 20మంది లబ్ధిదారులను గుర్తించిన వారికి అందజేయలన్నారు. గత ప్రభుత్వ కాలంలో డబుల్ బెడ్ రూమ్ లో పథకంలో భాగంగా 40 గృహాలను నిర్మించి దిశగా వెళ్లక పోగా ప్రభుత్వ ఖజానాకు గండికొట్టి అద్దాంతరంగా నిలిపివేశారన్నారు. ఈ40 గృహాలు పూర్తిస్థాయిలో త్వరితగరుతున్న నిర్మించాలన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ లబ్ధిదారులలో గృహము నిర్మించుకొనెవిదంగా గృహస్థలం నిరుపేదలకు ఎలాంటి జాప్యం లేకుండా అందించాలని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా చిగురు వెంకన్న ఓ ప్రకటనలో పేర్కొన్నారు. లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొండాపూర్ గ్రామ నిరుపేదల పక్షాన పోరాటం చేయడానికి వెనకాడబోమని అన్నారు.




