అక్టోబర్ 05 ఉమ్మడి అదిలాబాద్ జిల్లా
రేష్మ బేగం అలియాస్ సాదియా వయసు 30 సంవత్సరాలు, భర్త మీర్ ఆఖత్తర్ అలీ హస్మి వీరిద్దరికీ వివాహం జరిగి పది సంవత్సరాలు గడిచింది.
ప్రస్తుతం వీరు హైదరాబాదులోని సంతోష్ నగర్ లో ఇల్లు అద్దెకు తీసుకొని నివాసం గడుపుతున్నారు, అదే ఇంట్లో భర్త వేధింపుల వలన రేష్మ బేగం ఉరి వేసుకొని చనిపోయింది.
మంచిర్యాల నుండి అమ్మాయిని అసిఫాబాద్ వ్యక్తి అయినా మీర్ ఆఖత్తర్ అలీ హస్మి కి ఇచ్చి వివాహం చేయించడం జరిగింది. వివాహమైన దగ్గర నుండి తన భర్త అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్నారు. అత్తామామలు అయినా షౌకత్ భాను ,మీర్ సబీర్ ఆలీ హస్మి మరియు ఫర్హీన్ ఆడపడుచు కూడా రేస్మి బేగం ని శారీరకంగా మానసికంగా హింసించారు.
తన భర్త వేరే ఆడవాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకొని తన భార్యను నువ్వు చనిపో మీ వాళ్ళు సరైన కట్నం నాకు ఇవ్వలేదు, అని ఎప్పుడు శారీరకంగా మానసికంగా హింసిస్తూనే ఉన్నాడు. ఈ బాధలన్నీ భరించలేక అక్టోబర్ ఆడపడుచు
04 బుధవారం రోజున రేష్మి బేగం ఆత్మహత్య చేసుకొని చనిపోయింది.
అమ్మాయి తల్లిదండ్రులు నసీమా సుల్తానా, సయ్యద్ గులాం తన అల్లుని మీద అనుమానం ఉన్నదని తన అల్లుడు వాళ్ళ అత్త మామ ఆడపడుచుల వేధింపులతో హింసించడంతో భరించలేక మా కూతురు చనిపోయింది అంటున్నారు.
మా అల్లుని పైన వాళ్ళ తల్లిదండ్రుల పైన మరియు ఆడపడుచు పైన చట్టపరమైన కఠిన చర్య తీసుకొని మా అమ్మాయికి న్యాయం జరిపించగలరని పోలీసు వారిని కోరుచున్నారు.
