ఏఐఎస్బి ఆధ్వర్యంలో విద్యార్థులు అపోలో కళాశాల నుండి హుస్నాబాద్ స్థానిక అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐసబ్ ఏ ఐ బి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
పెండింగ్ లో వున్నా స్కాలర్షిప్ & రియాంబర్స్మెంట్ విడుదల చెయ్యాలి
ఏ.ఐ.ఎస్.బి ఎమ్మార్వో కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
ఏ.ఐ.ఎస్.బి జిల్లా నాయకుడు గడిపే సుజీత్ కుమార్
అక్టోబర్ 5
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అపోలో జూనియర్ కళాశాల నుంచి హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద వరకు వంద మంది విద్యార్థులతో ర్యాలీగా చేసి ఏఐఎస్బి నాయకులు హుస్నాబాద్ కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో వినపత్రం అందజేయడం జరిగింది అని ఏఐఎస్బి జిల్లా నాయకుడు గడిపే సుజీత్ కుమార్ అన్నారు.
ఈ సందర్బంగా జిల్లా నాయకుడు గడిపే సుజీత్ కుమార్ మాట్లాడుతూ. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగులో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రియంబర్స్ మెంట్స్ ను వెంటనే విడుదల చేయాలని,కార్పొరేట్ విద్యాసంస్థలను పూర్తిగా నిర్మూలించాలని,జిల్లా కేంద్రంలో ప్రభుత్వ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని,ఇంటర్ విద్యార్థులకు వెంటనే మధ్యాహ్న భోజనాన్ని పెట్టాలని,ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ,మెమో ఏం ఈ ఓ , డి ఈ ఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ,విద్యార్థులందరికీ ప్రభుత్వమే ఉచితంగా బస్ పాస్ లు ఇవ్వాలిని,మొదలగు ప్రధాన సమస్యలను పరిష్కరించాలని అనేక ఉద్యమాలు నిర్వహించినప్పటికి ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదని అన్నారు.
జిల్లా వ్యాప్తంగా సంక్షేమ, గురుకుల హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకపోవడం ములంగా విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలవుతున్నారు. అయినా పాలకులు అంతా బాగానే ఉందని చెప్పుకోవడం సిగ్గుచేటు.కార్పొరేట్ విద్యాసంస్థలను నిర్మూలించి, విద్యారంగంలో నెలకొన్న ఇలాంటి అనేక రకాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని స్పష్టంచేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్బి నాయకులు మాదరబోయిన అజయ్, దుర్ముట్ల శివకుమార్,నర్లపురం రంజిత్,గుళ్ళ సృజన్ , కుంచం గణేష్,సుంకరి సందీప్ , ఎరవెల్లి చందు,మలం రాకేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు,
