ప్రాంతీయం

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆరోగ్య కార్యక్రమాల అవగాహన

67 Views

మంచిర్యాల జిల్లా.

జాతీయ ఆరోగ్య మిషిన్ మరియు ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన సదస్సు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్  ఆదేశానుసారము గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గ్రామాలలో జాతీయ ఆరోగ్య మిషిన్ మరియు ఆరోగ్య కార్యక్రమాల పైన అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగినది ఇందులో భాగంగా తాళ్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పోచం కూడా జైతుగూడ కంచర్ బాగ్ ఓట్ల మారుమూల గిరిజన గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగినది ఇందులో భాగంగా కళాకారుల బృందం చే అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగినది డాక్టర్ క్రాంతి కుమార్ వైద్యాధికారి వైద్య సిబ్బంది ఆశ ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా అందిస్తున్న వైద్య సేవలు ఆయుష్మాన్ ఆరోగ్య భవన్ కార్యక్రమాలు మరియు జాతీయ కీటక నిమిత్త వ్యాధులు మలేరియా డెంగ్యూ చికెన్ గునియా వాటిపైన తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు అసంక్రమణ వ్యాధులు బిపి షుగర్ క్యాన్సర్లకు ముందస్తు పరీక్షలు జీవనశైలిలో మార్పులు వాటిపైన అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగినది అదేవిధంగా సికిల్ సెల్ ఎనీమియా కలిసిమియా వాటిపైన రక్తహీనత పైన మరియు క్షయ కుష్టు వ్యాధి నియంత్రణలో తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు వాతావరణ మార్పులతో వచ్చే వ్యాధుల పైన అవగాహన కల్పించడం జరిగినదని బుక్క వెంకటేశ్వర్ జిల్లా మాస్ మీడియా అధికారి తెలియజేసినారు ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్