హర్షం వ్యక్తం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర గిరిజనులు
భారతీయ జనతా ములుగు జిల్లా కార్యదర్శి పోదెం రవీందర్ దొర
ములుగు జిల్లా ,మంగపేట, అక్టోబర్ 01
తెలంగాణ రాష్ట్రంలోని 12 తెగల గిరిజన (ఆదివాసి, బంజారా)విద్యార్థుల భవిష్య త్తును దృష్టిలో ఉంచుకొని భారత ప్రధాన మంత్రి దామో దరదాస్ నరేంద్ర మోడీ తెలంగా ణ రాష్ట్ర పర్యటనలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంగా సమ్మక్క సారలమ్మ పేరుతో గిరిజన యూనివర్సిటీనీ ఏర్పాటు చేస్తున్నామని 900 కోట్ల రూపాయల నిధులను కేటాయించటం పట్ల తెలంగాణ రాష్ట్ర గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తూనట్లు భారతీయ జనతా ములుగు జిల్లా కార్యదర్శి పోదెం రవీందర్ దొర తెలిపారు. ములుగు జిల్లా కేంద్రంగా గిరిజ న యూనివర్సిటీనీ ఏర్పాటు చేయడం వలన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన గిరిజ నేతర విద్యార్థిని విద్యార్థులకు కూడా ఉన్నత విద్య (డిగ్రీ ,పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి) అందు బాటులోకి రావటం జరుగుతుం ది విద్య పూర్తయిన తర్వాత ప్రత్యక్షంగా పరోక్షంగా దాదా పుగా ఒక లక్ష ఉద్యోగ అవకా శాలు ఈ ప్రాంతంలో ఉన్నటు వంటి నిరుద్యోగు యువతకు అవకాశాలు జీవనోపాధి దొర కటం వలన ఆర్థికంగా సామాజి కంగా పురోభివృద్ధి సాధిస్తారని ఒక ఆదివాసి బిడ్డగా భారతీ య జనతా పార్టీ ములుగు జిల్లా కార్యదర్శిగా మా ఆదివాసి సమాజం తరఫున ములుగు ప్రాంత ప్రజల తరఫు న ప్రధానమంత్రికి ప్రత్యేక ధన్య వాదాలు తెలియజేస్తున్నామని అన్నారు.