రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట్ గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శుక్రవారం 8 వ తరగతి విద్యార్థి ని విద్యార్థులు లా అండ్ జస్టిస్ అనే పాఠ్యాంశం సందర్భంగా విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం మరియు అనుభూతి నిమిత్తం గంభీరావుపేట పోలీస్ స్టేషన్ ని సందర్శించడం జరిగింది అనీ ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలుఆశ్రతబస్సుంతెలిపారు అక్కడ స్వయంగా గంభీరావుపేట ఎస్సై మహేష్ పోలీస్ వ్యవస్థ మరియు నిందితులను గుర్తించడం మరియు కోర్టులో శిక్షపడే విధానం గురించి క్లుప్తంగా వివరించి స్టేషన్ మొత్తాన్ని రికార్డులను చూపించడం జరిగిందని సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు దాసరి శ్రీధర్ తెలిపారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భోయన్నగారి నారాయణ మాట్లాడుతూ పిల్లలకు ప్రత్యక్ష సందర్శన అనుభవం అనేటువంటిది శిక్షణ పొందిన ఉపాధ్యాయునిగా ఉంటుంది అని తెలిపారు పాఠ్యాంశాలకు ఇంతకుముందు కూడా రైతులు గడ్డిని కాల్చడాన్ని ప్రత్యక్ష అనుభవంతో పిల్లల్ని పంట పొలాలకు తీసుకువెళ్లి కాలుష్యానికి కారణం ఎట్లా అవుతుందో వివరించడం జరిగింది ఈ విధంగా విద్యార్థులకు పూర్తిగా అనువాపూర్వకమైనటువంటి విద్యా బోధన అనేటువంటి అభినందనీయమని ప్రధానోపాధ్యాయులు బోయన్న గారి నారాయణ మరియు ఉపాధ్యాయ బృందం ఉపాధ్యాయుడిని అభినందించారు ఇట్టి కార్యక్రమంలో 8వ తరగతి విద్యార్థిని విద్యార్థులు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు దాసరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు




