ప్రకటనలు

సీఐ కార్యాలయంలో ఫోటోగ్రఫీ పోస్టర్ ఆవిష్కరణ

219 Views

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎల్లారెడ్డిపేట మండల ఫోటో వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ రమాకాంత్,చేతుల మీదుగా పాస్టర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ముత్యాల ప్రభాకర్ రెడ్డి ఫోటోగ్రాఫర్లు మాట్లాడుతూ ఫోటోగ్రఫీ రంగంలో ఫోటోగ్రఫీ అప్డేట్స్ గురించి టెక్నాలజీ అదేవిదంగా కెమెరాల పనితనం తెలుసుకోవాలన్న ఒకప్పుడు ముంబై,ఢిల్లీ మహానగరాలకే పరిమితమైనటువంటి ఈ ఫోటో ఎక్స్పో ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో ఎక్స్ప్లోర్ ఫ్యూచర్ ఆఫ్ ఫోటోగ్రఫీ హైదరాబాద్ ఎక్స్పో తెలంగాణ ప్రాంతంలో ఏర్పాటు చేయడం అభినందనీయం అని అన్నారు.

గ్రామాల నుండి మొదలుకొని పట్టణాల వరకు ఉన్న ప్రతి ఫోటోగ్రాఫర్ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా సిఐ శశిధర్ రెడ్డి గారిని మరియు ఎస్ఐ రమాకాంత్ గారిని సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు

ఈ కార్యక్రమంలో మండల సభ్యులు మహమ్మద్ ఫక్రోద్దీన్,మహమ్మద్ షాదుల్,పాలోజీ శ్రీనివాస్,మారోజు నరసింహాచారి, మహమ్మద్ అజ్జుమొద్దిన్, పెంజేర్ల తిరుపతి యాదవ్, మారోజు కుబేర స్వామి, షాడ శేఖర్ రెడ్డి,విజయ శ్రీధర్,భస్వపోరం కృష్ణ తదితరులు పాల్గోన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *