దౌల్తాబాద్: దౌల్తాబాద్ మండల ఎన్ఎస్ యూఐ మండల అధ్యక్షుడిగా మండల పరిధిలోని కోనాపూర్ గ్రామానికి చెందిన పంచమి రామస్వామి నియామకమయ్యారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ ఎన్ఎస్ యూఐ రాష్ట్ర ఇంచార్జ్ అక్షయ్ లక్రా,ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లప్పుడూ విద్యార్థుల పక్షాన ఎన్ఎస్ యూఐ పోరాటం చేస్తుందన్నారు.
