
సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 24(TS24/7 తెలుగు న్యూస్): జగదేవపూర్ మండలంలోని చాట్లపల్లి గ్రామంలో వినాయక యూత్ ఆధ్వర్యంలో వినాయకుని వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు జంబుల దేశాయ్ రెడ్డి, బరిగే బిక్షపతి, బాలకృష్ణా రెడ్డి, బరిగే నర్సింలు, చిలుముల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ ఇక్కడ ప్రతి ఏటా వినాయక నవరాత్రులలో భాగంగా అన్న దాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఈ విధంగా చేయడం వలన మాకు దేవుని యొక్క కృప ఉందని మరియు చాలా సంతోషంగా ఉందని ఆన్నారు.




