మల్లంపల్లిని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తాం
అభ్యర్థి గెలుపే కేసిఆర్ కు కృతజ్ఞత
జేఏసి నాయకులతో కలిసి ర్యాలీ
దివంగత జడ్పీ చైర్మెన్ జగదీష్ చిత్ర పటానికి నివాళీ
కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
అంబేద్కర్ విగ్రహానికి పూల మాల
ర్యాలీలో జడ్పీ చైర్ పర్సన్ నాగజ్యోతి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు
,ములుగు, సెప్టెంబర్ 24
నూతనంగా ఏర్పడ్డ మల్లంప ల్లిని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తామని ములుగు జడ్పీ చైర్ పర్సన్ ములుగు నియోజక వర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. మల్లంపల్లి నూతన మండ లంగా ముఖ్యమంత్రి కేసిఆర్ జీఓ విడుదల చేసిన సంద ర్బంగా మల్లంపల్లి సాధన సమితి జేఏసి నాయకులతో కలిసి ములుగు జడ్పీ చైర్ పర్సన్ ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ములుగు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గోవిందు నాయన్ తో కలిసి సంబరాలు నిర్వ హించారు.అందులో భాగంగా మల్లంపల్లిలో ర్యాలీ నిర్వ హించి అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి అదే విధంగా దివంగత ములుగు జడ్పీ చైర్సన్ జగదీశ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించి డప్పు చప్పుళ్లు పోరాటాలతో భారీ ర్యాలీ నిర్వహిస్తూ సంబ రాలు చేశారు.ఈ సందర్బంగా జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ మల్లంపల్లి జేఏసి నాయకుల నాలుగు సంవత్సరాల కృషి ఫలించిందని ఈసందర్బంగా ఆమె కేసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.దివంగత జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ మల్లంపల్లి పట్టణ ఏర్పాటు కోసం ఎంతగానో కృషి చేశారని ములుగు గడ్డపై గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని మల్లంపల్లి ప్రజలంతా బీఆర్ ఎస్ పార్టీకి అండగా ఉండాలని అన్నారు.ఈసందర్బంగా మల్లంపల్లి మండల ఏర్పాటు కృషిచేసిన కేసిఆర్, కేటిఆర్, సత్యవతి రాథోడ్,దయాకర్ రావు,పల్లారాజేశ్వర్ రెడ్డి , పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాలోతు కవిత లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దివంగత జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ ఇన్ని రోజులు తన కళగా ఉన్న మల్లంపల్లి మండలం ఏర్పాటుతో ఎక్కడో ఉన్న ఆయన ఆత్మశాంతి స్తుందని వారు తెలిపారు.