విద్య

టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యులను బర్తరఫ్ చేయాలి

103 Views

 

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దు టీఎస్పీఎస్సీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం

బీఎస్పీ జిల్లా ఇంఛార్జి వీరబోయిన రాజేందర్ ముదిరాజ్

బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు శనిగరపు నరేష్ కుమార్

ములుగు జిల్లా,ములుగు, సెప్టెంబర్ 13

కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం (హైకోర్టు) గ్రూప్ 1 అభ్యర్థులకు 2వ సారి నిర్వహించిన పరీక్షను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసిన తరుణంలో బీఎస్పీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కాడపాక రాజశేఖర్ వర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రిక ప్రకటనలో బీఎస్పీ ము లుగు జిల్లా ఇంఛార్జి వీరబోయి న రాజేందర్ ముది రాజ్ (రిటైర్డ్ ఆర్మీ )శనిగరపు నరేష్ కుమార్ బీఎస్పీ ములుగు జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ 11న టీఎస్పీ ఎస్సీ రెండోసారి నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు అనేది కేసీఆర్ నిరుద్యోగుల ద్రోహి అని టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యానికి నిదర్శ నం అన్నారు.టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ సూత్రదారులు ముఖ్యమంత్రి కార్యాలయంలో నే ఉన్నారని గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షకు హాజరైన వారికంటే కొత్తగా 270 ఓఎంఆర్ షీట్లు అదనంగా ఎలా వచ్చాయో, టీఎస్పీఎస్సీ చైర్మన్ సమాధా నం చెప్పాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని సభ్యు లను ప్రభుత్వం తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.గ్రూప్‌-1 అభ్యర్థుల కోచింగ్ కోసం ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.నిరుద్యో గులకు 2వ సారి నిర్వహించిన గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకో కపోవడం,హాల్ టికెట్ నెంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్ ఇవ్వ డం కారణంనే నేడు ఈ పరీక్ష రద్దు అయ్యే పరిస్థితి దాపు రించింది అనిఆగ్రహం వ్యక్తం చేశారు.నిరుద్యోగుల తల్లిదం డ్రులను వివిధ రకాల బంధుల పేరుతో మభ్య పెడుతూ, వారి బిడ్డలకు తీరని ద్రోహం చేస్తున్న, కేసీఆర్ కుట్రలను తిప్పికొ ట్టాలని పిలుపునిచ్చారు.

విద్యార్థులు మేధావులు, నిరుద్యోగులు తెలంగాణ ప్రజలంతా రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా బహు జన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వ హించే ఆందోళన పోరాటాలకు, మద్దతు నివ్వాలని టిఎస్పి ఎస్సి చైర్మన్ సభ్యులను వెంట నే బర్తరఫ్ చేసి నూతన సభ్యులతో కమిషన్ ఏర్పాటు చేయాలని నవంబర్ నెలలో నిర్వహించబోయే గ్రూపు ట

2 పరీక్షలు కూడా కొత్త కమిషన్ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు.ఇంత జరుగుతున్నా కూడా బిజెపి కేంద్ర ప్రభుత్వం టిఎస్పిఎస్సి లీకేజీ పట్ల సిబిఐ ద్వారా ఎంక్వైరీ నిర్వహించకుండా కేసీఆర్ కు వత్తాసు పలుకు తుందని ఆరోపించారు. సోమవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వం లో, నిరుద్యోగులతో ఆందోళన పోరాటాలకు వుంటాయని, పోలీసుల ద్వారా అడ్డుకో వాలని చూస్తే రాష్త్రం అగ్ని గుండం అవుతుందని హెచ్చ రించారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ అసెంబ్లీ కార్యదర్శి నక్క రాజు,మండల అధ్యక్షుడు చాగంటి రమేష్,నాయకులు శ్రీకాంత్,అఖిల్,రాజు,అశోక్, జగదీష్,పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Janapatla Jayaraju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *