నిరుద్యోగుల పాలిట శాపం – కేసీఆర్ ప్రభుత్వం
-బీఎస్పీ గజ్వేల్ నియోజకవర్గ కమిటీ
సెప్టెంబర్ 23
నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి 1300 మంది విద్యార్థుల బలిదానాల మీద తెచ్చుకున్న తెలంగాణ లో నిరుద్యోగులపై కేసీఆర్ ప్రభుత్వం కక్ష పూరిత వైఖరి కొనసాగిస్తుంది. 36 లక్షల నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతు నిర్లక్ష్యం పూరితంగా గ్రూప్-1 పరీక్ష నిర్వహించి రెండవ సారి కూడా రద్దు అవ్వడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ దిష్టి బొమ్మ ను దహనం చేయడం జరిగింది.
గతంలో టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ అవినీతి మీద బి.ఎస్.పి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేయడం వల్ల రద్దయింది. ఇప్పుడు తాజాగా మళ్ళీ జూన్ 11న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో బయో మెట్రిక్ తీసుకోకపోవడం, హాల్ టికెట్ నెంబర్ లేకుండా ఓ ఎం ఆర్ షీట్ ఇవ్వడం వంటి అవకతవకలు గుర్తించి హైకోర్టు రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని తీర్పిచ్చింది.ఈ నిరుద్యోగ వ్యతిరేక కేసీఆర్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను గజ్వేల్ నియోజకవర్గ నాయకులు తగల బెట్టడం జరిగింది.
బిఎస్పీ డిమాండ్స్:
1. @టిఎస్పిఎస్ కాఫీషియల్ కమీషన్ తక్షణమే రద్దు చేసి, ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా సీఎం రాజీనామా.
2. కమీషన్ ను పూర్తిగా ప్రక్షాళన చేసి కొత్త కమిషన్ ద్వారా మాత్రమే మిగతా పరీక్షలను నిర్వహించాలి.
3. కొత్తగా వచ్చిన 270 ఓ ఎం ఆర్ షీట్లపై పూర్తి స్థాయి విచారణ జరపాలి.
4. ఎస్ ఐ టి ఇన్వెస్టిగేషన్లో కమీషన్ ఛైర్మన్,సభ్యులు మరియు ఎస్ ఓ వెంకటలక్ష్మిలను నిందితులుగా చేర్చాలి.
5. ఈ కేసును సిబిఐ కు అర్జంటుగా అప్పగించాలి.
6. అందరు అభ్యర్థులకు కనీసం లక్ష రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలి
8. Gr-1 కుంభకోణంలో @ తెలంగాణ సీ ఎం వో మరియు కేటీఆర్ పాత్రను ఇప్పటికైనా వెలికి తీయాలి.
పైవన్నీ జరగనిచో లక్షలాది నిరుద్యోగ బిడ్డలూ, వారి కుటుంబాలు తెలంగాణ లో బిఆరెస్ ఎమ్మెల్యేలను తిరగనివ్వద్దని కోరుతున్నాము.
నిరుద్యోగ మిత్రులారా దయచేసి నిరాశ పడకండి- మన బహుజనరాజ్యంలో పారదర్శకంగా నిజాయితీగా పరీక్షలను నిర్వహిస్తాం అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఓం ప్రకాష్ , నియోజకవర్గ ఇంచార్జి లు కొండనోళ్ళ నరేష్ , కెతోజి వినోద్,నియోజకవర్గ అధ్యక్షులు గూడూరి కర్ణాకర్, ఉపాధ్యాక్షులు గుర్రం ఎల్లం, కోశాధికారి మొండి కర్ణాకర్ ,ప్రధాన కార్యదర్శి కానుగుల రమణాకర్ , ఈసీ మెంబెర్ ఆశని కనక ప్రసాద్, కుకుకునూర్ పల్లి మండల అధ్యక్షులు బక్కోళ్ల కర్ణాకర్, పెంటకాడి సుధాకర్, రాజు, ప్రసాద్ పాల్గొన్నారు.





