సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 19(24/7):జగదేవపూర్ మండలం గొల్లపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల కోరిక మేరకు పాఠశాల విద్యార్థులకు అవసరమైన స్కూల్ బ్యాగులను ఎడ్యుకేట్ అండ్ ఎన్ రిచ్మెంట్ ఫౌండేషన్ చైర్మన్ ప్రతిక్ శీల మంగళవారం పాఠశాల యాజమాన్య కమిటీకి అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు గార్లపాటి మధుసూదన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. పాఠశాలలో చదువుతున్న 50 మంది విద్యార్థులకు 20వేల రూపాయల విలువతో కూడిన స్కూల్ బ్యాగులను విద్యార్థులకు అందజేయడం జరిగిందన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులను అందించిన ఫౌండేషన్ సభ్యులు గార్లపాటి మధుసూదన్ కి సహకరించిన ఉపాధ్యాయులు రామకృష్ణ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామకృష్ణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
