మంచిర్యాల నియోజకవర్గం.
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ముందుగా ఈరోజు ఉదయం అనారోగ్యంతో మరణించిన సీనియర్ జర్నలిస్ట్ ఎండీ మున్నీరు ఆత్మ శాంతికై రెండు నిమిషాల పాటు మౌనం పాటించడం జరిగింది.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా పని చేశానని చెప్పుకునే దివాకర్ రావు మంచిర్యాలలో అభివృద్ధి ఎక్కడ చేసాడో వెల్లడిస్తే బాగుంటుందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సవాల్ చేశారు.
ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దివాకర్ రావు తీరును ఎండకట్టారు. మంచిర్యాల ను అన్ని విధాలుగా వెనుకబాటుకు గురి చేసిన దివాకర్ రావు అభివృద్ధి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు.
మంచిర్యాల లో విద్య, వైద్య సేవలు విస్తృత పరుస్తూ రహదారులను విస్తరింప చేస్తుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. నాఇంటి ముందు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంకు ఏర్పాట్లు జరగడం దివాకర్ రావు సహించడం లేదని మండిపడ్డారు.
వేంపల్లిలో పరిశ్రమల నిలయం కావడం దివాకర్ రావుకు కంటగింపుగా ఉందని అన్నారు. ఐటీ పార్కును అడ్డుకుంటామని అనడం అభివృద్ధి నిరోదకమే అవుతుందని అన్నారు. ఐటీ పార్కు అయితే వందలాదిమంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని గుర్తు చేశారు.
భూ నిర్వాసితులకు సంతోషకరమైన ప్యాకేజి ఇస్తానని భరోసా ఇచ్చారు.. మాట్లాడితే నా ఇంటి గురుంచి దివంగత హజీపూర్ హన్మంతరావు గురుంచి మాట్లేడే దివాకర్ రావుకు వాస్తవాలు వెల్లడిస్తే మైండ్ బ్లాక్ అవుతుందని అన్నారు. అంతే కాకుండా నీ కుమారుడు విజిత్ రావు చేష్టల గురుంచి ప్రజలకు తెలిస్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆత్మవలోకనం చేసుకోవాలని సూచించారు.
నీవు ఎన్ని విమర్శలు, ఆరోపణలు చేసిన మంచిర్యాలను విద్య, వైద్య పరంగా అభివృద్ధి చేసి తీరితానని స్పష్టం చేశారు.
ఎల్లంపల్లి భూ నిర్వాసితులకు ఎంతవరకు న్యాయం చేసావో బహిరంగంగా చెప్పాలని సవాలు విసిరారు. అభివృద్ధి పనుల్లో ఎలా కమీషన్లు వస్తాయో దివాకర్ రావుకు బాగా తెలుసని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు నామీద పై చేసిన ఆరోపణలు నిరూపించాలని దివాకర్ రావుకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సవాల్ విసిరారు.
2028 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యమే.
దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు.
