
ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 19
పాఠశాలకు తాగి వస్తున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి,ఎల్ రవి అన్నారు.మంగపేట మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు జాడి యుగేందర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి,ఎల్ రవి మాట్లాడుతూ మండలంలో కొంతమంది ఉపాధ్యాయులు పేద మధ్య తరగతి విద్యార్థులకు విద్యా బోధన చెప్పకుండా పాఠశాలకు మద్యం తాగి వస్తున్నరని అన్నారు.పాఠశాలకు తాగి వచ్చిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని వారు అన్నారు.పాఠశాలకు తాగి వస్తున్న ఉపాధ్యాయులను విచారణ జరిపి వారిని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తా మని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వి సిద్దు,జిల్లా కమిటీ సభ్యులు రవితేజ,బాలు, సతీష్,పాల్గొన్నారు.




