ప్రాంతీయం

పెరిక సంఘం జిల్లా అధ్యక్షుని ఎన్నిక

177 Views

ములుగు జిల్లా,తాడ్వాయి, సెప్టెంబర్ 19

 

తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క,సారక్క సన్నిధిలో మంగళవారం ములు గు జిల్లా పెరిక కుల ఆత్మీయ సమ్మేళనంలో తాడ్వాయి మండలం కాటాపురానికి చెందిన దిడ్డి మోహన్ రావు ను ములుగు జిల్లా పెరిక కుల సంఘం జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర పెరిక సంఘం నాయకులు,వరంగల్ ఉమ్మడి జిల్లా నాయకులతో పాటు ములుగు జిల్లాలోని వివిధ మండలాల నుండి హాజరైన ప్రజల మధ్య ఎన్నికల కన్వీనర్ కీత విజయకుమార్ పర్యవేక్ష ణలో జరిగిన అద్యక్ష ఎన్నికకు మోహనరావుతో ఎగ్గడి కోట య్య,బియ్యాల కుమారస్వామి పోటీ పడ్డారు కుల పెద్దల సూచన మేరకు, కుల ఐక్యత కోసం పోటీ పడిన ఇరువురు పోటీ నుండి విరమించుకోగా దిడ్డి మోహన్ రావు ఎన్నిక ఏకగ్రీవమైంది జిల్లా ప్రధాన కార్యదర్శిగా బండారుపెల్లికి చెందిన పెట్టెం రాజు ఉపాధ్య క్షులుగా బండారుపల్లికి చెందిన బియ్యాల కుమారస్వామి రామన్నగూడెంకు చెందిన ఎగ్గడి కోటయ్య, గౌరవ అధ్యక్షులుగా నూగూరు వెంకటాపురంకు చెందిన పల్నాటి నాగేశ్వర్ రావు ను ఎన్నుకున్నారు.కొత్తగా ఏర్పడిన ములుగు జిల్లా మొదటి పెరిక కుల అధ్యక్షుడిగా ఎన్నికైన మోహన్ రావు మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి గ్రామంలో పర్యటించి పెరిక కుల గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి సకల సామాజిక రంగాల్లో పెరిక కులస్తులను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదుగుదలకు కృషి చేస్తామని అన్నారు.ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన ములుగు పెరిక కులస్థులకు పూర్వ వైబవం తీసుకొస్తానని ఈ ప్రాంత ప్రజల విద్య, వైద్య,ఉపాధి సమస్యల్లో పాలుపంచుకుంటానని అన్నా రు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పెరిక కుల రాష్ట్ర అసోసియేట్ అద్యక్షులు సుంకరి ఆనంద్ మాట్లాడుతూ నిత్యం ఉత్పత్తి శ్రమలో పాల్గొం టూ మానవ మనుగడకు పాటుపడుతున్న వ్యవసాయిక కులమైన పెరిక కులస్తులను అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేయడం కోసం తెలంగాణ పెరిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మద్ధ లింగయ్య నాయకత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేపడుతు న్నామని తెలిపారు.ములుగు జిల్లా కమిటీ ఎన్నికకు జిల్లా ప్రజలను సమీకరించి ఇతోధి కంగా కృషి చేసిన రాష్ట్ర ఆర్గ నైజింగ్ సెక్రెటరీ కీత విజయకు మార్ మాట్లాడుతూ పెరిక కుల ప్రజలు ఐకమత్యంతో ముందు కు సాగి పరస్పర సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అన్నారు. జిల్లా ప్రజలకు రాష్ట్ర కమిటి నాయకత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర సంఘం న్యాయ విభాగం నాయకులు సాయిని నరేందర్ మాట్లాడుతూ రాజకీయంలో కీలకపాత్ర పోషిస్తున్న ములుగు జిల్లా గోదావరి పరివాహక ప్రాంత పెరిక కులస్థులు బహుజన ఉద్యమాలకు నాకత్వం వహించాలని, విద్య ఉద్యోగ రంగాల్లో రాణిస్తున్న పెరికలు రాజకీయాల్లో కూడా రాణించాలని అందుకు కావల్సిన సహకారాన్ని కులంలో ఎదిగిన పెద్దలు అందిస్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా రైతు సేవా సమితి అద్యక్షులు పల్ల బుచ్చయ్య,రాష్ట్ర పెరిక సంఘం ఆర్గనైజింగ్ సెక్రెటరీ కీత విజయ్ కుమార్,రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరాం విజయ్ పాల్,బొలుగొట్టు శ్రీనివాస్, అక్కల రవి,పెరిక కోపరేటివ్ సొసైటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకతి విజయ్ కుమార్, వరంగల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ చింతం ప్రవీణ్ కుమార్, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు సూరం రవీందర్,భద్రాద్రి కొత్త గూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి పూజారి వెంకటేశ్వర్లు,రామ న్నగూడెం సర్పంచ్ దొడ కృష్ణ, బండారుపల్లి సర్పంచ్ అక్కల రఘునాథ్,మాజీ సర్పంచ్ బుద్దే వీరన్న,ఎం.పి.టి.సి. లు అల్లి శ్రీనివాస్,ఇండ్ల రాజు, కాటపూర్ మాజీ సర్పంచ్ మేడిశెట్టి నర్సింహాయ్య, నాయకులు సాయిని శ్రీనివాస్, దిడ్డి శరత్ కుమార్, ధర్మపురి శ్రీనివాస్, మేడిశెట్టి రమణయ్య, మేడిశెట్టి పురుషోత్తం, పల్నాటి ముకుందం,దిడ్డి నాగేశ్వర్ రావు,కాసర్ల సాంబయ్య, నలివెల సతీష్,న్యాయవా దులు అర్షం రాంబాబు,ఎగ్గడి సుందర్ రామ్ తదితరులు పాల్గొని మాట్లాడారు.జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన మోహన్ రావు కు ములుగు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ ఆక రాధాకృష్ణ,మేడారం సమ్మక్క, సారలమ్మ దేవస్థానం ప్రోగ్రాం ఆఫీసర్ మధు,ములుగు జిల్లా కాంగ్రెస్ నాయకుడు చిడెం మోహన్ రావు,ఎరంగారి మోహన్ రావు,పెరిక ధాత్రి పత్రిక ఎడిటర్ పరుపటి సంపత్,సీనియర్ న్యాయవా దులు గుమ్మల్ల మల్లికార్జున్, సందేసాని రాజేంద్రప్రసాద్, అల్లం నాగరాజు తదతరులు అభినందనలు తెలిపారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *