భారీగా తరలివచ్చిన యువత..
(మానకొండూర్ జూన్ 25)
తిమ్మాపూర్ మండల కేంద్రంలోని కొత్తపల్లి సాయిరాం గార్డెన్ లో ఎమ్మెల్యే కవ్వంపల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు అపూర్వ స్పందన లభించింది..
మానకొండూర్ నియోజకవర్గలోని నిరుద్యోగ యువత ఈ జాబా మేళాకు పెద్ద సంఖ్యలో హాజరై ఉద్యోగాలు పొందారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కలక్టర్ ప్రమేల సత్పతి ముఖ్య అతిథిగా హాజరై యువతనుద్దేశించి మాట్లాడారు.ఉద్యోగ అవకాశాల కోసం నిరుద్యోగ యువత లెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు.
యువతను సన్మార్గంలో పయనింపజేసేందుకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మున్ముందు మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. అనంతరం 68 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించారు. వీటికి సుమారు 3 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రముఖ కంపెనీలైన కేపీఆర్ డెవలపర్స్, అపోలో ఫార్మసీ, ఈక్విటీ సెక్యూరిటీ సర్వీస్, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, మనీ పవర్ గ్రూప్, ఆదిత్య ఈకో ఆర్గానిక్స్, జనిత్ క్రాప్ కేర్, సింధుజ మైక్రో క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్, కంపెనీలతో పాటు బ్యాంకింగ్ సంస్థలు కూడా ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్నాయి. నెలకు కనీసం 10 వేలు మొదలుకుని 40వేల జీతంతో సుమారు 500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించగా కలెక్టర్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ అనురాధ, మానకొండూర్ ముద్దసాని సులోచన,తిమ్మాపూర్ తాహాశీల్దార్ కనకయ్య, తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టి మండల అధ్యక్షులు మోరపల్లి రమణా రెడ్డి, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.