జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ బాబు ఎమ్మెల్యే అభ్యర్థి నాగ జ్యోతి
ములుగు జిల్లా,సెప్టెంబర్ 17
పదవి విరమణ స్వచ్ఛందంగా ప్రజాసేవకు అంకితం చేస్తూ పదవి విరమణ చేసిన ఆదివాసి ముద్దుబిడ్డ సమ్మక్క సారక్క వారసుడు కొమురం భీం వారసుడు ఆదివాసి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి కృష్ణ ప్రసాద్ పదవి విరమణ సభ ములుగు జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్ లో శ్రీరామ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు సభ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ములుగు జడ్పీ చైర్మన్ ములుగు టిఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణరావు హాజరై మాట్లాడుతూ స్వచ్ఛందంగా రెండు సంవత్సరాల ముందే ప్రజా సేవకు అంకిత మై స్వచ్ఛందంగా ప్రజా జీవితానికి ప్రజల సేవ కోసం పదవి విరమణ చేయడం చాలా గర్వించదగ్గ విషయమని పి కృష్ణ ప్రసాద్ ని గర్వంగా ఉందని వారు అన్నారు. ఎంతోమంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు తీర్చిదిద్దిన మహోన్నతమైన మేధావి ఇప్పుడు కూడా ప్రజల కోసం పనిచేస్తున్న మహా మేధావి పి కృష్ణ ప్రసాద్ అని ఆయన కొనియాడారు.మారుమూల ఏజెన్సీ ఆదివాసి గిరిజన గూడెంలో తొండ్యాల గ్రామంలో జన్మించిన మహోన్నతమైన వ్యక్తి పి కృష్ణ ప్రసాద్ అని ఆయన అన్నారు. ములుగు జిల్లా జేఏసీ చైర్మన్ ముంజల బిక్షపతి గౌడ్ మాట్లాడుతూ ఆదివాసీల ఆత్మీయ ముద్దుబిడ్డ అందరితో ఆత్మీయంగా ఉండే అజాత శత్రువు ఉద్యమ నాయకుడు మేధావి ఉపాధ్యాయ లోకానికి ఆదర్శప్రాయుడు అని ముంజల అన్నారు.ఒకవైపు వృత్తి ధర్మాన్ని చేపడుతూ మరోవైపు నిరంతరం ప్రజల కోసం సామాజిక సమస్యల పైన ఉద్యమాలు నిర్మించేవాడని ఆయన అన్నారు మూడున్నర దశాబ్దాలుగా ఉపాధ్యాయుల వృత్తిలో ఉన్నారని స్కూల్ అసిస్టెంట్ గా ఎంఏ బీఈడీ ఇంగ్లీష్ లో ప్రథమ స్థానంలో ఉత్తిరిత సాధించి ఉపాధ్యాయ వృత్తిలో అడుగుపెట్టిన రూ 1964 లో పి కాంతయ్య సమక్కల దంపతులకు ప్రధాన సంతానంగా జన్మించినారు కావున లీల గార్డెన్లో స్వచ్ఛందంగా పదవి విరమణ చేయడం చాలా గర్వించదగ్గ విషయమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ పి గోవింద నాయక్, ఎంపీపీలు గండ్రకోట శ్రీదేవి, సూడి శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ ఉద్యోగుల సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు గుల్లగట్టు సంజీవ, ఉద్యోగ సంఘం జేఏసీ అధ్యక్షులు మాడుగుల నాగేశ్వరరావు, ఉపాధ్యాయ సంఘం జేఏసీ అధ్యక్షులు మధుసూదన్, బాబురావు, అట్కర్ సమ్మయ్య, ములుగు అభివృద్ధి కమిటీ అధ్యక్షులు అన్నవరం రవికాంత్, బాలాజీ కళాకారులు వేల విజయ్, గోల్కొండ బిక్షపతి, ఆదివాసి నాయకపోడు సంఘం రాష్ట్ర అధ్యక్షులు దెబ్బ సుధాకర్, ఎమ్మార్పీఎస్ మాదిగ ఉద్యోగుల సంఘం జిల్లా ఇన్చార్జి నెమలి నరసయ్య, మాదిగ ఆదివాసి ఉద్యోగుల సంఘం విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు వజరాజు, ఆదివాసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు దెబ్బగట్ల సుమన్, ఆదివాసి ఉద్యోగుల మహిళ నాయకురాలు మహిళా ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఘనంగా సన్మానించిన వివిధ ప్రజా సంఘాల ఉద్యోగ సంఘాల నాయకులు ఆదివాసి సంఘాల నాయకులు వివిధ పాటలతో కళాకారులు కవుల రూపాలలో రచయితలు ఘనంగా సన్మానించిన రూ తదితరులు పాల్గొన్నారు.