ముస్తాబాద్, ప్రతినిధి సెప్టెంబర్ 17, భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని స్థానిక వివేకానంద విగ్రహం వద్ద మరియు తహసిల్దార్ కార్యాలయంవద్ద జెండా కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం ఇప్పటికైనా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో బిజెపి నాయకులు జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ కరెడ్ల మల్లారెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ గిరిధర్ రెడ్డి, సీనియర్ నాయకులు అంజా గౌడ్, మీసాశంకర్, పప్పుల శ్రీకాంత్, ఉపేంద్ర దీటి సత్తయ్య, మండల అధ్యక్షురాలు కమిటీకారి పద్మ, కిసాన్ మోర్చ మండల అధ్యక్షుడు వరి వెంకటేష్ ,బిజెపి మండల ఉపాధ్యక్షుడు ఎద్నూరి గోపి, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి కళ్యాణ్ బీజేవైఎం నాయకులు బోయిని అజయ్, మద్దికుంట రమేష్, పరుశరాములు తదితరులు పాల్గొన్నారు




