గజ్వేల్ పట్టణ కేంద్రం నుండి ఆదివారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజయభేరి సభకు కాంగ్రెస్ పార్టీ డెలిగేట్ సభ్యులు మాదాడి జస్వంత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు ఈ సందర్భంగా జశ్వంత్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేయడం ఖాయమని కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరిగిందని తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతగా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కిషన్ సెల్ అధ్యక్షులు బాలకృష్ణారెడ్డి, నాయకులు బూరుగుపల్లి కృష్ణారెడ్డి, కొండపాక సుదర్శన్, నర్సంపల్లి నాగరాజు, అక్కారం ప్రశాంత్, గిరిపల్లి రాజు, కొప్పు రవి, ప్రతాప్ రెడ్డి, బాలకృష్ణ, ప్రసాద్, ప్రభాకర్, లక్ష్మణ్, కనకయ్య, పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
