మంచిర్యాల జిల్లా.
అంబేద్కర్ దేశ అభివృద్ధికి దిక్సూచి, అమిత్ షా పార్లమెంట్ లో అంబేద్కర్ పై హేళనగా మాట్లాడడం సరికాదు.
అమిత్ షా దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి.
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా.(i) రాష్ట్ర అధ్యక్షులు పార్నంది రమేష్ చంద్ర మాట్లాడుతూ…
పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమీషా ప్రసంగిస్తూ ఈ మధ్యన అంబేద్కర్ అనే పదం ఫ్యాషన్ అయిపోయిందంటూ హేళనగా మాట్లాడుతూ, చిన్న చూపుతో అంబేద్కర్ని అవమానించే విధంగా ప్రసంగించారని, ఆ మాటలను వెంటనే ఉపసంహరించుకోని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని పార్నంది రమేష్ చంద్ర రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్ చేశారు. అంబేద్కర్ ని పేరును హేళనగా మాట్లాడడం అంటే, భారతదేశాన్ని హేళనగ మాట్లాడడమేనని, బాబా సాహెబ్ అంబేద్కర్ దేశ అభివృద్ధికి దిక్సూచి అన్నారు. అంబేద్కర్ పేరు అనేది ఈ దేశంలో ఈక్వాలిటీ కి అర్ధం అని, ఈ దేశంలో మన ప్రజలకు ప్రేరణ అంబేద్కర్ పేరని తెలిపారు. అమీత్ షాకు అధికార గర్వంతో కళ్ళు నెత్తికెక్కి, శాంతిభద్రతలకు విగాథం కలిగించే విధంగా, సమాజంలో అలజడి సృష్టించాలని కుట్రలో భాగమే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన అమిత్ షాపై తక్షణమే దేశద్రోహం కేసు నమోదు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. “అంబేడ్కర్ నామ జపం యిప్పుడు ఫ్యాషన్ అయిపొయింది. అన్ని సార్లు దేవుడు పేరును స్మరిస్తే ఏడు జన్మలు పాటు స్వర్గ ప్రాప్తి పొందేవారు” అని హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో అన్న మాట బీజేపీ మనసులో వున్న మాట, ఇది బిజెపి అసలు స్వరూపం అని అన్నారు. భారత రాజ్యాంగం కలిపించిన ఆర్టికల్ 326 వల్లనే దేశ ప్రజల ఓటు హక్కు ద్వారా మిమ్ముల్ని ఎన్నుకొని చట్ట సభల్లోకి పంపారు. ఎ దేవుడు నిన్ను పంపలేదు. వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశాన్ని రక్షించే బాధ్యతలో ఉండి, మతం మత్తులో అడ్డగోలుగా మాట్లాడుతే, ప్రజలే త్వరలో తగిన బుద్ది చెబుతారని అన్నారు. త్వరలో అంబేద్కర్ ఆశయాన్ని వారి రాజకీయ వారసత్వాన్ని ఇంటింటికి గడపగడపకు తీసుకువెళ్లాలని యువత రాజకీయాల్లో రావాలని ఆర్పిఐ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పార్నంది రమేష్ చంద్ర పిలుపునిచ్చారు.





