ఉపాధ్యాయులను సన్మానించిన జ్వాలా యూత్ అండ్ ట్రస్టు సభ్యులు
మంగపేట, సెప్టెంబర్ 05
మంగపేట మండలం రాజుపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధ కృష్ణన్ జయంతి గురుపూజోత్సవం వేడుకలు పాఠశాల ప్రధానో పాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధ కృష్ణన్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించి ఘనంగా నిర్వహించారు.రాజు పేట పాఠశాలలోని ఉత్తమ ఉపాధ్యాయులను ముఖ్య అతిథులుగా విచ్చేసిన జ్వాల యూత్&ట్రస్ట్ సభ్యులు శాలు వాలు కప్పి ఘనంగా సన్మానం చేశారు.ప్రధానోపాధ్యాయులు జి శ్రీనివాస్,ఉపాధ్యాయులు వి రమాదేవి,పివి నారాయణ,ఎస్ జామున,వి రాజ్యలష్మి ఏ పావని,డి పద్మ,డి లావణ్య, బి మహాదేవి,పి అస్మాబేగం, వి సుజాత,టీ ప్రమీల,జ్వాలా యూత్ & ట్రస్ట్ అధ్యక్షులు కోడెల నరేష్ ఉపాధ్యక్షులు మునిగల రాకేష్,పుల్లంశెట్టి అజయ్,ప్రచార కార్యదర్శి ముప్పారపు రాజు,గౌరవ సలహదారులు సయ్యద్ బాబా,పాల్గొన్నారు.