భీమ్ ప్రతిభ పురస్కారం-2023 ప్రధానం…..
భీమ్ యువత* అధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా, చదువులో ప్రతిభ కనబర్చిన 6-10 తరగతి, ZPHS ఎల్లారెడ్డి పెట్ విద్యార్థులకు,
*భీమ్ ప్రతిభ పురస్కారం – 2023*, *BHEEM EXCELLENCE AWARD-2023
అందించటం జరిగింది.
అంబేడ్కర్ లాగా చదువులో ఉన్నత స్థాయికి వెళ్లి, ఈ దేశ అభ్యున్నతి, పాటుపడాలని, చదువు నేర్చుకునే స్థాయి నుండి, చదువు చెప్పే స్థాయికి, ఓటు వేసే స్థాయి నుండి ఓటు వేయించుకునే స్థాయికి, చప్పట్లు కొట్టే స్థాయి నుండి చప్పట్లు కొట్టించుకునే స్థాయికి, విద్యార్థులు చేరుకోవాలని, విద్యార్థులు ప్రతి రోజు ఇంటి నుండి వచ్చేటప్పుడు మెదడులో ప్రశ్నలు నింపుకొని రావాలి అని, అవి బడిలో నివృత్తి చేసుకుని, రేపు అన్యాయాన్ని, అధర్మాన్ని, అవినీతిని, అసమానతలను ప్రశ్నించే స్థాయికి చేరుకుని, ఏ అంటే ఫర్ ఆపిల్ అని కాకుండా ఏ ఫర్అంబేడ్కర్ అని చదివినప్పుడు మాత్రమే, మన జీవితాలు వెలుగులు నిపముకుంటాయి అని భీమ్ యువత ప్రతినిధి *గడ్డం జితేందర్* అన్నారు. ఇట్టి కార్యక్రమంలో, గడ్డం వెంకటేష్,విజయ్, ధర్మెందేర్, చెన్నయ్య, మేఘరాజు, సన్నీ, గణేష్, వినోద్, రామచంద్రం, కిరణ్ నిలేష్, ఎంపీటీసీ పందిర్ల నాగరాణి, SMC చైర్మన్, సభ్యులు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.
