మంగపేట, సెప్టెంబర్ 02
మంగపేట మండలం తిమ్మం పేట గ్రామానికి చెందిన కావేరి వరప్రసాద్ కు జగిత్యాల మెడి కల్ కాలేజీలో ఎంబిబిఎస్ సిటు రాగ పేదరికంలో ఉన్న వర ప్రసాద్ కోర్స్ పూర్తి చేసే నాటికి ఆర్థిక స్తోమత లేదని తెలుసు కున్న దుర్గం లక్ష్మీ నారాయణ (టీచర్) 5000/- రూపాయలు ఆర్థిక సాయం నేతకాని కుల సంఘం ద్వారా ఆ విద్యార్థినికి అందజేశారు.మంచిగా చదువుకొని గొప్ప డాక్టర్ గా వృద్ధిలోకి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జాడి సాంబశివరా వు,జిల్లా నాయకులు బసారి హరికృష్ణ,బసరి నాగార్జున, మండల కోశాధికారి దిగొండ శ్రీను,సంఘం నాయకులు గోమాసు నరసింహారావు,దుర్గం బిక్షపతి,దిగొండ చిరంజీవి, దుర్గం శ్రీను,గోమాస్ నరసింహా రావు,దుర్గం నరసింహారావు, గోమాసు మాణిక్యం,జాడి లక్ష్మయ్య,దుర్గం కంటమ్మ, పాల్గొన్నారు.