కొంపల్లి-5 బ్రాంచ్ శ్రీ చైతన్యలో మహాత్మా గాంధీకి ఘణ నివాళులు
-78 వ వర్ధంతి సందర్భంగా
– శ్రీ చైతన్య పాఠశాల కొంపల్లి-5 బ్రాంచ్ లో
స్వాతంత్ర సమరయోధుడు మన దేశ జాతిపిత మహాత్మా గాంధీ అని శ్రీ చైతన్య పాఠశాల -5 బ్రాంచ్ ప్రిన్సిపల్ సాయి కృష్ణ కొనియాడారు. మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి గురువారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహింసా అనే ఆయుధంతో బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసి 1948 జనవరి 30వ తేదీన అమరులయ్యారని, ఆయన జీవిత చరిత్ర గురించి విద్యార్థులకు వివరించి ఆయన బోధనలు మనమందరం అనుసరించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి జోన్ ఏజీఎం జీవీ రమణ రావు , ఆర్ ఐ చక్రి ,పాఠశాల ప్రిన్సిపల్ సాయి కృష్ణ ,హాస్టల్ ప్రిన్సిపాల్ చందు,డీన్ గోవింద్,ఐపీఎల్ ఇన్చార్జి శ్రవణ్, అసోసియేట్ డీన్ సంపత్,ఐకాన్ ఇన్చార్జి శివానంద్,సి బ్యాచ్ ఇన్చార్జి రణదీప్,ప్రాథమిక విభాగం అధికారిణి వాసవి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
