ప్రాంతీయం

శ్రీలత హాస్పిటల్ ను తనిఖీ చేసిన డిఎంహెచ్వో అధికారులు

35 Views

డి ఎం హెచ్ వో ఆదేశానుసారం శ్రీలత హాస్పటల్ ను తనిఖీ చేయడం జరిగింది.

మంచిర్యాల జిల్లా.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత  ఆదేశానుసారము జిల్లాలోని ప్రైవేటు నర్సింగములు ఆసుపత్రులను తనిఖీల్లో భాగంగా శ్రీలత ఆసుపత్రిని తనిఖీ చేయడం జరిగినది. ఈ ఆస్పత్రిలోనూ జరుగుతున్న ప్రసవాలపైన సి సెక్షన్ సిజేరియన్లు సాధారణ ప్రసవాలు గర్భవతులకు అందిస్తున్న వైద్య సేవలు ప్రసవమైన తర్వాత ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు పైన తనిఖీ చేసి తగు వివరములను సేకరించడం జరిగినది. ఈ ఆసుపత్రిలో అక్టోబర్ నెలలో 40 ప్రసవాలకు గాను 38 ప్రసవాలు సిజేరియన్లుగా మొదటి కాన్పునకు చేయడం ప్రైమీ ప్రసవాలు ఎందుకోసం సిజేరియన్లు చేశారు ఆడిట్ చేయడం జరిగినది. ఈ సందర్భంగా డాక్టర్ అప్పల ప్రసాద్ ప్రోగ్రాం ఆఫీసర్ మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రులలో గర్భవతులకు సరైన సౌకర్యాలు కలిగించాలని అదేవిధంగా అందిస్తున్న వైద్య సేవలను వివరములను వాటికి సంబంధించిన ధరలను గోడ పైన అతికించాలని అతికించిన వాటిని చూడడం జరిగినది అదేవిధంగా లేబర్ రూమ్ లో సాధారణ ప్రసవాలకు సంబంధించిన వివరములను ఉంచాలని ఆదేశించినారు మీ ఆసుపత్రిలో ముఖ్యంగా ప్రతి గర్భవతికి సౌకర్యం కల్పించడం స్కానింగ్ వివరములను నమోదు చేయడము సాధారణ ప్రసవం కోసం ప్రయత్నం చేయడం అదేవిధంగా సౌకర్యాలు కల్పించడం అందిస్తున్న వైద్య సేవలు వాటి ధరల పట్టికలను గోడపై అతికించడం వైద్యుల వివరములను వైద్య సిబ్బంది వివరములను ఫోన్ నెంబర్ తో సహా అతికించడం ప్రతి గర్భవతికి కౌన్సిలింగ్ నిర్వహించి అందిస్తున్న వైద్య సేవలు వాటి ధరలను తెలియజేయడము ఫార్మాసిస్టు ద్వారా మందులను విక్రయించడం చేయాలని ఆదేశించినారు 38 ప్రైమీ ప్రసవాలు వాటి వివరములను సేకరించి ఎందుకోసం చేశారు వాటి వివరములను సేకరించడం జరిగినది.

ఈ కార్యక్రమంలో ఈ సమీక్షలు డాక్టర్ అప్పల ప్రసాద్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శివప్రసాద్ బుక్క వెంకటేశ్వర్ జిల్లా మాస్ మీడియా అధికారి, శ్రీలింగారెడ్డి శ్రీ వెంకటేశ్వర సి హెచ్ ఓ లక్ష్మణస్వామి ఆరోగ్య సిబ్బంది శ్రీలత ఆసుపత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీలత వారి నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు ముఖ్యంగా జిల్లాలోని ప్రసూతి కేంద్రాలను తనిఖీ చేసి వారి వివరములను సమగ్రంగా సేకరించి జిల్లా కలెక్టర్ కి తెలియజేయడం జరుగుతుందని డాక్టర్ ఎస్ అనిత జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తెలియజేసినారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *