ప్రాంతీయం

గాంధీ చిత్రాన్ని చూసిన 3,631 మంది విద్యార్థులు…

180 Views

 ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు16,గాంధీ చిత్రాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3,631 మంది విద్యార్థిని విద్యార్థులు వీక్షించారు. విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాన్ని, పెంపొందించేందుకు, గాంధీ గొప్పతనాన్ని నేటితరానికి తెలియ జేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు వారి తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈచిత్రాన్ని ఈనెల14 నుంచి ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. తొలి రోజు 1,767 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వీక్షించారు. ఈనెల 15నా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్ర ప్రదర్శనకు విరామం ఇచ్చారు. కాగా ఈనెల 16న చిత్ర ప్రదర్శనను తిరిగి ప్రారంభించారు. ఈరోజు 1864 మంది చిత్రాన్ని వీక్షించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *