*”నగరంలోని పలు వరద ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి”*
వరంగల్ నగర పరిధిలోని జలమయమైన పలు ప్రాంతాలలో గురువారం రోజున గ్రేటర్ వరంగల్ నగర మేయర్ *శ్రీమతి గుండు సుధారాణి* గారు వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపునేని నరేందర్, కలెక్టర్ ప్రావీణ్య,కమీషనర్ షేక్ రిజ్వాన్ భాషా లతో కలిసి పర్యటించి స్థానిక ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించినారు. పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న స్థానికులతో మాట్లాడి ఆదైర్య పడవద్దని భరోసా కల్పించినారు.
బి.ఆర్.నగర్, ఎస్.ఆర్.ఆర్.తోట, హంటర్ రోడ్, రామన్నపేట, చిన్న వడ్డేపల్లి చెరువు, కీర్తి బార్ వద్ద గల నాలా, మర్రి వెంకటయ్య కాలనీ-2, వీవర్స్ కాలనీ, సి.ఆర్.కాలనీ, లోతుకుంట తదితర ప్రాంతాల్లో పర్యటించి నీటి ప్రవాహ తీరును మేయర్ *శ్రీమతి గుండు సుధారాణి* గారు కార్పొరేటర్లను, స్థానిక ప్రజలను క్షేత్రస్థాయి వాస్తవ స్థితి గతులను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పల్లం పద్మ, ఫుర్ఖాన్, బస్వరాజు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
