రాలేదు ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు11, అంబేద్కర్ నగర్ ప్రాథమికొన్నత పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులకు ఎంపీపీ జనగామ శరత్ రావు జన్మదినం పురస్కరించుకొని ముస్తాబాద్ గ్రామానికి చెందిన శీలం వెంకటేష్ శరత్ అన్న ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లకు పైచిలు ఆరోగ్యంగా ఉండాలని తనసొంత సహాయంతో ముస్తాబాద్ ప్రజాప్రతినిధుల సమక్షంలో శుక్రవారం పిల్లలకు బుక్కులు, పెన్నులు, చాక్లెట్స్ పంపిణీ చేశారు. ఈసందర్భంగా శీలంవెంకటేష్ మాట్లాడుతూ జన్మనిచ్చే తల్లిదండ్రులను, విద్యనేర్పే గురువులను ఎప్పటికీ, ఎన్నటికీ విస్మరించరాదు. ప్రతితల్లిదండ్రులు కోరుకునేది జీవితంలో పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటారని అన్నారు. ఈకారణంగా ఉపాధ్యాయులు చెప్పిన ప్రతి అంశాలను ఎప్పటికప్పుడు చక్కగా బుద్ధిగా చదువుకొని తల్లిదండ్రుల, గురువుల పట్ల, గౌరవంతో మెలుగుతూ మంచి విలువలతో కూడిన విద్యను అభ్యసించినట్లయితే కచ్చితంగా విద్యార్థుల కలలు సాకారమైతాయని తెలిపారు. ఈకార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు. ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
