ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు11,ఎంపీపి జనగామ శరత్ రావు జన్మదిన వేడుకలు స్థానిక తెలంగాణతల్లి విగ్రహంవద్ద ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా మండల బిఆర్ఎస్ పార్టీనాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. అందులో భాగంగానే ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్లు పంపిణీచేసి అనంతరం మందిరంలో పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో జడ్పిటిసి గుండంనరసయ్య, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, కొండ శ్రీనివాస్ గౌడ్, కోఆప్షన్ సాదులుపాపా, అన్వర్, మెంగని మనోహర్, శీలంస్వామి, చిగురు నరేష్, కంచంనర్సింలు, నందురెడ్డి, నందురావు సురోధుల నరేంద్రచారి, కోడె శ్రీనివాస్, జెల్లవెంకటస్వామి, వెంకటేష్ మహిళా నాయకులు సావిత్రి, స్వర్ణ, మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




