Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

ఎట్టకేలకు ఎల్లారెడ్డిపేటకు డిగ్రీ కళాశాల మంజూరు

181 Views

ఎల్లారెడ్డిపేటకు ఎట్టకేలకు డిగ్రీ కళాశాల మంజూర అయిందని మండల ప్రజా ప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు
– జీవో కాపీని ఎంపీపీ జడ్పిటిసి లకు అందజేత
– సిరిసిల్ల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్
,ఎల్లారెడ్డిపేట:

ఎల్లారెడ్డిపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మంజూరు అయ్యిందని సిరిసిల్ల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్ పేర్కొన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తూ జీవో నెంబర్ 57 ప్రకారం ఉత్తర్వులను సెక్రటరీ శ్రీమతి కరుణ వాకటి ఐఏఎస్ చేశారని అన్నారు. 2023- 24 సంవత్సరానికి నూతన అడ్మిషన్లు ప్రారంభించబడతాయని కళాశాలలో కోర్సులు బిఏ ఇంగ్లీష్, బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్, సి ఎ, బిఎస్సి బీ జెడ్ సి, బిఎస్సి ఫిజికల్ సైన్సెస్ లలో ప్రతి కోర్సు నుంచి 60 సీట్ల చొప్పున అడ్మిషన్లు జరుగుతాయని తెలిపారు. అదేవిధంగా మండలంలోని ఇంటర్మీడియట్ సెకండియర్ పాస్ అయిన విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కళాశాల మైదానంలో విద్యార్థిని విద్యార్థులు మంత్రి కేటీఆర్ కెసిఆర్ లకు పాలాభిషేకం చేశారు అనంతరం టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంజాద్ అలీ, లెక్చరర్ వై నర్సయ్య పాల్గొన్నారు. దీంతో మండల ప్రజా ప్రతినిధులు ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి సింగిల్ విండో గుండారపు కృష్ణారెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *