ముస్తాబాద్, సెప్టెంబర్ 1 (విశ్వబ్రాహ్మణులు) స్వర్ణకారులు తమ కులవృత్తిని పరిరక్షించాలని మా కులవృత్తిని నమ్ముకొని మేముండగా పొరుగు రాష్ట్రాల వారెవరు మా ఫోట్టమీద కొట్టొద్దని మండల కేంద్రంలోని స్వర్ణకారు అధ్యక్షులు సింతోజు బాలయ్య ఆధ్వర్యంలో స్థానిక ముస్తాబాద్ మేజర్ గ్రామపంచాయతీ సమీపంవద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. నిరాహార దీక్ష 8 రోజులకు చేరుకోగా నేడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి, మాజీ సీనియర్ నాయకులు దీటి నర్సింలు వారికి మద్దతుగా సంఘీభావం తెలిపారు. ఈ రిలే దీక్ష వేదికను పార్టీలకు అతీతంగా పలు మాజీ ప్రజా ప్రతినిధులు సంఘీభావం తెలిపారని స్వర్ణకారుల పేర్కొన్నారు. అంతేకాకుండా పరిష్కారం కోసం కృషి చేస్తామని వారన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు వెంగళం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు సంతోజు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సంతోజు భాస్కర్, చేవూరి బ్రహ్మం పలువురు స్వర్ణ కారు సంఘ సభ్యులు పాల్గొన్నారు.
