*నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు*
*4 సంవత్సరాలు ప్రొబేషనరి గడువు ముగిసినందున తమని రెగ్యులరైజ్ చేయాలని,తమ సమస్యని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని గుత్తా సుఖేందర్ రెడ్డిని కోరిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు.
*ఈ విషయాన్ని తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి రెగ్యులరైజ్ అయ్యేలా చూస్తానని హామీనిచ్చిన గుత్తా సుఖేందర్ రెడ్డి.
నల్గొండ : గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు నల్గొండ లోని క్యాంపు కార్యాలయం తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ని కలిశారు. తాము ఉద్యోగాల్లో చేరి 4 సంవత్సరాల ప్రొహిబిషన్ గడువు ముగిసినందున తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని ,వారి విన్నపాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయాలని గుత్తా సుఖేందర్ రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సంధర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో వేగంగా నడిపించాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం -2018 ప్రకారం ప్రతి గ్రామానికి ఒక కార్యదర్శి ఉండేలా మొత్తము 9355 మంది గ్రామ కార్యదర్శులను నియామకం చేసారని తెలిపారు. గ్రామాలను అభివృద్ధి చేసుకోవడం కోసం పల్లె ప్రగతి ప్రోగ్రాంను 5 విడతలుగా నిర్వహించడం జరిగింది అని చెప్పారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన గ్రామాలు, పట్టణాలు గత 8 సంవత్సరాల పాలనలో గొప్పగా అభివృద్ధి చెందయని తెలిపారు. ఆ గ్రామాలు అభివృద్ధి చెందడంతో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల సమిష్టి కృషి అభినందనీయం అన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శి లను రెగ్యులరైజ్ చేయాలనే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉందని,వీలైనంత త్వరగా ఈ సమస్యను ముఖ్యమంత్రి
దృష్టికి తీసుకువెళ్లి ,రెగ్యులరైజ్ చెపిస్తానని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హామీనిచ్చారు.