పేదలకు వరం సీఎం సహాయనిది బయ్యారం సర్పంచ్ మద్దూరి శ్రీనివాస్ రెడ్డి.ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయనిది ఎంతో ఉపయోగపడుతుందని బయ్యారం గ్రామ సర్పంచ్, సిద్దిపేట జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు శ్రీ మద్దూరి శ్రీనివాస్ రెడ్డి అన్నారు, బయ్యారం గ్రామానికి చెందిన 1.పంగ నవీన్, 2.నుచ్చు రాజేశ్వరి , కొన్ని రోజుల క్రితం అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో అధికంగా డబ్బులు ఖర్చు కాగా సీఎం సహయనిది దరఖాస్తు చేసుకున్నారు వారికీ మంజురైన చెక్కును తన స్వగృహంలో తన చేతుల మీదుగా చెక్కులను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం సహయనిది వరంగా మారిందన్నారు. గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలకు వైద్య సేవల కోసం సీఎం సహయనిది కార్యక్రమలు చేపట్టలేదని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దిలాల్పూర్ సర్పంచ్ దయాకర్ రెడ్డి, మండల TRSV అధ్యక్షులు పంగ మోహన్ బాబు పాల్గొన్నారు.
