ప్రాంతీయం

కూడవెల్లి రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో బందోబస్తు ఏర్పాట్లు

70 Views

కూడవెల్లి రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో బందోబస్తు ఏర్పాట్లు..పర్యవేక్షించిన సిపి రష్మీ పెరుమాళ్ ఐపీఎస్..

సిద్దిపేట జిల్లా, జనవరి 17, తెలుగు న్యూస్ 24/7 

కూడవెల్లి రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో బందోబస్తుఏర్పాట్లను పర్యవేక్షించిన సిపి రష్మీ పెరుమాళ్ ఐపీఎస్,కుడవెళ్లి లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శనివారం సందర్శించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు చేపట్టిన బందోబస్తు క్యూ లైన్ల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో స్వయంగా తనిఖీ చేశారు.తనిఖీలో భాగంగా సిపి చేసిన ప్రధాన సూచనలు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లను క్రమబద్ధీకరించాలని, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు చిన్న పిల్లలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.ఆలయ పరిసరాల్లో వాహనాల రద్దీ పెరగకుండా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేయాలని, వాహనదారుల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాల నిఘా పెంచాలని, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి నిఘా ఉంచాలని అధికారులకు స్పష్టం చేశారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ భక్తులకు మంచినీటి సౌకర్యం ఇతర కనీస అవసరాలు అందేలా చూడాలని పేర్కొన్నారు.అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల భద్రత తమ ప్రథమ ప్రాధాన్యత అని, ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా సిపి తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఏసీపీ రవీందర్, దుబ్బాక సీఐ శ్రీను, భూంపల్లి ఎస్ఐ హరీష్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *