42 Viewsరాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాయపోల్ మండల ఎంపీటీసీ అభ్యర్థిగా కర్రే వెన్నెల ఎల్లం బరిలో నిలుస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎంపీటీసీ అభ్యర్థుల ఫైనల్ ఎంపిక కోసం రాజకీయ పార్టీలు కసరత్తు ప్రారంభించిన నేపథ్యంపై, కాంగ్రెస్ పార్టీ నుండి రాయపోల్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన కర్రే వెన్నెల ఎల్లం తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “నేను మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ, పార్టీ సిద్ధాంతాల పట్ల కట్టుబడి […]
ప్రాంతీయం
సోమవారం ప్రజావాణి రద్దు జిల్లా కలెక్టర్ హైమావతి
31 Viewsస్థానిక సంస్థల ఎన్నికల నియమావలళీ అమలులో ఉన్నందున 6వ తేదీన సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ముగిసే వరకు కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినందున ప్రజావాణి కార్యక్రమం కోసం కలెక్టరేట్ కు ఎవరు రావద్దని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో జిల్లా ప్రజలకు తెలిపారు. Manne Ganesh Dubbaka […]
దేశభక్తి, జాతీయభావం ప్రతి ఒక్కరిలో ఉండాలి.
30 Viewsదేశభక్తి, జాతీయభావం ప్రతి ఒక్కరిలో ఉండాలని బజరంగ్ ధళ్ మెదక్ విభాగ్ ప్రముఖ్ సత్యంజీ అన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం దౌల్తాబాద్ మండల కేంద్రంలో ప్రధాన వీధుల గుండా స్వయం సేవకులు పద సంచాలన్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గంప రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 100 సంవత్సరాలుగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. హిందూ సంఘటన ధ్యేయంగా నిరంతరం ఆర్ఎస్ఎస్ కృషి […]
అఖిలరాజ్ ఫౌండేషన్ మండల అధ్యక్షుడిగా కోరె శేఖర్
28 Viewsఅఖిలా రాజ్ ఫౌండేషన్ సేవా సంస్థ మండల అధ్యక్షునిగా మండల పరిధిలోని ముబారస్ పూర్ గ్రామానికి చెందిన కోరే శేఖర్ ను ఎన్నుకున్నట్లు దుబ్బాక నియోజకవర్గం బాధ్యుడు బిట్ల భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యక్షులుగా అంతొల్ల అంజి (దొమ్మాట), చింతకింది రాజు (మల్లేశం పల్లి), కార్యదర్శులుగా కర్ణాకర్ (ముబారస్ పూర్) బొల్లం రాజేష్ (సూరంపల్లి ), కోశాధికారిగా గొల్లపల్లి ప్రేమ్ ని నియమించినట్లు తెలిపారు. నిరుపేదలకు అండగా నిలవడమే లక్ష్యంగా పేదరికంతో చదువుకు దూరం […]
చేబర్తిలో ఘనంగా దసరా పండుగ వేడుకలు
55 Viewsసిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో గురువారం దసరా పండుగ సందర్భంగా స్థానిక మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన గ్రామస్థులు ఈ సందర్భంగా గ్రామ తాజా మాజీ సర్పంచ్ అశోక్, తాజా మాజీ ఉప సర్పంచ్ స్వామి, సీనియర్ నాయకుడు బబ్బూరి రాందాస్ గౌడ్, పద్మాకర్ రావు మాట్లాడుతూ అందరికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయం సందర్భంగా విజయ దశమి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని అందులో […]
ఘనంగా దసరా ఉత్సవాలు
47 Viewsసిద్దిపేట జిల్లా రాయపొల్ మండల పరిధిలోని ముంగీస్ పల్లి ఎస్సీ కాలనీలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు డప్పులతో సప్పులతో పాల పిట్టను చూసి, అనంతరం జమ్మి చెట్టుకు పూజ చేసి గ్రామస్తులందరూ చిన్న, పెద్ద అనే తేడా లేకుండా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. Manne Ganesh Dubbaka constancy 9701820298
గంగమ్మ ఒడికి చేరిన బతుకమ్మలు
33 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని వివిధ గ్రామాలలో సద్దుల బతుకు పండుగలను ఘనంగా నిర్వహించారు. ముంగాజీపల్లి ఎస్సీ కాలనీలో సద్దుల బతుకమ్మ పండుగను కనుల పండుగగా నిర్వహించి, గునుగు, తంగేడు తీరోక పువ్వులతో బతుకమ్మను అలంకరిస్తూ ఆడపడుచులు ఎంతో ఇష్టమైన ఈ పండుగను ఆనందంతో, ఉత్సాహంతో జరుపుకున్నారు. చిన్నవారూ పెద్దవాళ్లూ తేడా లేకుండా కాలనీవాసులు సంప్రదాయాలకు అనుగుణంగా అందంగా అలంకరించి, సద్దుల బతుకమ్మ ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు ఆడపడుచులు ఒక్కరోజు ఒక్కొక్క […]
పాములపర్తి విద్యానగర్ కాలనీలో ఘనంగా దసరా సంబరాలు
87 Viewsపాములపర్తి విద్యానగర్ కాలనీలో ఘనంగా దసరా సంబరాలు సిద్దిపేట జిల్లా, మర్కుక్ అక్టోబర్ 2 సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల్ పాములపర్తి గ్రామం విద్యానగర్ కాలనీ వాసులు విద్యానగర్ కాలనీలో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర, ఘనంగా దసరా సంబరాలు జరుపుకోవడం జరిగింది.శమీ వృక్షం లేదా జమ్మి చెట్టు (లాటిన్ ) ఫాబేసి కుటుంబానికి చెందినది. హిందువులు ఈ చెట్టును విశేషంగా పూజిస్తారు. ఇది పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను ఉంచిన స్థలం. ఈ చెట్టు […]
ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
109 Viewsపలుగు గడ్డ లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు సిద్దిపేట జిల్లా జగదేవపూర్, సెప్టెంబర్ 29 జగదేవ పూర్ : బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో… అంటూ జగదేవ పూర్ మండలం లోని పలుగు గడ్డ గ్రామం లో మారుమోగింది. సోమవారం తెలంగాణ సంప్రదాయమైన బతుకమ్మ పండుగను (సద్దుల బతుకమ్మ) మహిళలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. అష్టమి రోజు సద్దుల బతుకమ్మను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం నుంచే గ్రామం లో పండుగ […]
ఘనంగా బతుకమ్మ సంబరాలు
93 Viewsపాములపర్తి విద్యానగర్ కాలనీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు సిద్దిపేట జిల్లా, మార్కుక్, సెప్టెంబర్ 29 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి విద్యానగర్ కాలనీలో సోమవారం బతుకమ్మ పండుగ సంబరాలు భక్తిశ్రద్ధలతో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ సాంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు,ఈ సందర్భంగా ములుగు రేణుక, ములుగు భాగ్యలక్ష్మి, మొద్దు యశోద, మొద్దు అనూష, గిద్దల ఎల్లవా, మొద్దు ఎల్లవా, మొద్దు మౌనిక, మాట్లాడుతూ, అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు, తెలంగాణలో […]










