ప్రాంతీయం

ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు 

102 Views

పలుగు గడ్డ లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

 సిద్దిపేట జిల్లా  జగదేవపూర్, సెప్టెంబర్ 29

జగదేవ పూర్ : బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో… అంటూ 

జగదేవ పూర్ మండలం లోని పలుగు గడ్డ గ్రామం లో మారుమోగింది. సోమవారం తెలంగాణ సంప్రదాయమైన బతుకమ్మ పండుగను (సద్దుల బతుకమ్మ) మహిళలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. అష్టమి రోజు సద్దుల బతుకమ్మను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం నుంచే గ్రామం లో పండుగ వాతావరణం నెలకొంది. రంగురంగుల పూలను తీసుకువచ్చి పెద్ద సైజుల్లో ఆకట్టుకునే విధంగా బతుకమ్మలను తయారు చేశారు. గునుగు, తంగేడి, బంతి, చామంతి పువ్వులతో బతుకమ్మలను పేర్చారు. మహిళలు బతుకమ్మ ఆటలు ఆడేందుకు ఏర్పాట్లు చేశారు.

సాయంత్రం ఇంటి ముందర బతుకమ్మలను పెట్టి మహిళలు బతుకమ్మ పాటలతో ఆటలు ఆడారు. అనంతరం బతుకమ్మ ప్రాంగణంకు బతుకమ్మలను ఉంచి ఏర్పాటు చేసిన డీజే సౌండ్‌ పాటలకు అనుగుణంగా మహిళలు ఆటలు ఆడారు. వేదపండితులతో బతుకమ్మలకు పూజలు నిర్వహించి, అనంతరం మలుకుంట చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. మహిళలు ఒకరినొకరు వాయినాలు ఇచ్చుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *