రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాయపోల్ మండల ఎంపీటీసీ అభ్యర్థిగా కర్రే వెన్నెల ఎల్లం బరిలో నిలుస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎంపీటీసీ అభ్యర్థుల ఫైనల్ ఎంపిక కోసం రాజకీయ పార్టీలు కసరత్తు ప్రారంభించిన నేపథ్యంపై, కాంగ్రెస్ పార్టీ నుండి రాయపోల్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన కర్రే వెన్నెల ఎల్లం తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “నేను మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ, పార్టీ సిద్ధాంతాల పట్ల కట్టుబడి ఉన్నాను. పార్టీ పెద్దల ఆశీర్వాదంతో, కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీటీసీ అభ్యర్థిగా ప్రజలకు సేవ చేయడానికి సన్నద్ధమవుతున్నాను” అని తెలిపారు. కొత్తపల్లి, లింగరెడ్డిపల్లి, కృష్ణ సాగర్ గ్రామ ప్రజల అనుగ్రహం మరియు మద్దతు ఉండాలని ఆమె ఆకాంక్ష వ్యక్తం చేశారు.





