దేశభక్తి, జాతీయభావం ప్రతి ఒక్కరిలో ఉండాలని బజరంగ్ ధళ్ మెదక్ విభాగ్ ప్రముఖ్ సత్యంజీ అన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం దౌల్తాబాద్ మండల కేంద్రంలో ప్రధాన వీధుల గుండా స్వయం సేవకులు పద సంచాలన్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గంప రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 100 సంవత్సరాలుగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. హిందూ సంఘటన ధ్యేయంగా నిరంతరం ఆర్ఎస్ఎస్ కృషి చేస్తుందని పేర్కొన్నారు. 1925వ సంవత్సరంలో డాక్టర్ జీ హెడ్గేవర్ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సంస్థను ప్రారంభించారని, 100 సంవత్సరాలలో ఆర్ఎస్ఎస్ సాధించిన విజయాలను తదితర విషయాలను వివరించారు. ఈ కార్యక్రమంలో స్వయం సేవకులు రమేష్, తరుణ్, ప్రభు, స్వామి, రజనీకాంత్, రంజిత్, కిషన్, స్వామి తదితరులు పాల్గొన్నారు.





