పాములపర్తి విద్యానగర్ కాలనీలో ఘనంగా దసరా సంబరాలు
సిద్దిపేట జిల్లా, మర్కుక్ అక్టోబర్ 2
సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల్ పాములపర్తి గ్రామం విద్యానగర్ కాలనీ వాసులు విద్యానగర్ కాలనీలో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర, ఘనంగా దసరా సంబరాలు జరుపుకోవడం జరిగింది.శమీ వృక్షం లేదా జమ్మి చెట్టు (లాటిన్ ) ఫాబేసి కుటుంబానికి చెందినది. హిందువులు ఈ చెట్టును విశేషంగా పూజిస్తారు. ఇది పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను ఉంచిన స్థలం. ఈ చెట్టు యొక్క శాస్త్రీయ నామం ప్రోసోపిస్ సైసిజెరా. వైదిక భాషలో శమీ వృక్షాన్ని ‘అరణీ’ అనే పేరుతో పిలుస్తారు. అగ్నిని ఉద్భవించేందుకు కాష్టాంతరంచే మధింప యోగ్యమైన దారువని “ఆరణి’ అని అర్ధం. అందుకే పూర్వకాలం నుండి శమీవృక్షం పూజనీయమైంది, అని యువకులు గ్రామ పెద్దలు తెలిపారు.





