స్థానిక సంస్థల ఎన్నికల నియమావలళీ అమలులో ఉన్నందున 6వ తేదీన సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ముగిసే వరకు కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినందున ప్రజావాణి కార్యక్రమం కోసం కలెక్టరేట్ కు ఎవరు రావద్దని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో జిల్లా ప్రజలకు తెలిపారు.





