సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో గురువారం దసరా పండుగ సందర్భంగా స్థానిక మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన గ్రామస్థులు ఈ సందర్భంగా గ్రామ తాజా మాజీ సర్పంచ్ అశోక్, తాజా మాజీ ఉప సర్పంచ్ స్వామి, సీనియర్ నాయకుడు బబ్బూరి రాందాస్ గౌడ్, పద్మాకర్ రావు మాట్లాడుతూ అందరికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయం సందర్భంగా విజయ దశమి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా చేబర్తి లో గ్రామస్థులు అందరూ సోదర భావంలో వేడుకలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.





