సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని వివిధ గ్రామాలలో సద్దుల బతుకు పండుగలను ఘనంగా నిర్వహించారు. ముంగాజీపల్లి ఎస్సీ కాలనీలో సద్దుల బతుకమ్మ పండుగను కనుల పండుగగా నిర్వహించి, గునుగు, తంగేడు తీరోక పువ్వులతో బతుకమ్మను అలంకరిస్తూ ఆడపడుచులు ఎంతో ఇష్టమైన ఈ పండుగను ఆనందంతో, ఉత్సాహంతో జరుపుకున్నారు. చిన్నవారూ పెద్దవాళ్లూ తేడా లేకుండా కాలనీవాసులు సంప్రదాయాలకు అనుగుణంగా అందంగా అలంకరించి, సద్దుల బతుకమ్మ ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు ఆడపడుచులు ఒక్కరోజు ఒక్కొక్క బతుకమ్మను రూపొందించి, గౌరమ్మ ఒడికి చేరవేశారు.





