ఆధ్యాత్మికం

రామాలయ విగ్రహ ప్రతిస్టాపనకు గాను 1కోటి 16లక్షల లిఖిత రామ నామాలను అందించి భక్తిని చాటుకున్న రామకోటి రామరాజు

133 Views

 పట్టణంలోని ప్రసిద్ధి చెందిన నూతన రామాలయంలో రాముని విగ్రహ ప్రతిస్టాపనకు గాను శ్రీరామకోటి ధార్మిక సేవా సంస్థ వారు 1కోటి 16లక్షల లిఖిత రామ నామాలను అందించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ రాజమౌళి చేతుల మీదుగా 1కోటి 16లక్షల లిఖిత రామ నామాలను దేవాలయ అధ్యక్షులు కాల్వ శ్రీధర్ రావు గారికి అందజేశారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ రామ నామాన్ని మనసారా నమ్మిన రామకోటి రామరాజు 1కోటి16లక్షల లిఖిత రామ నామాను అందించడం రామ భక్తికి నిదర్శనం మన్నారు. గజ్వేల్ లోని కేసరి హనుమాన్ దేవాలయానికి, శేష సాయి షిర్డీ మందిరంతో పాటు ఆంద్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా 50దేవాలయాలకు పై అందించిన రామ ఘనత రామకోటి రామరాజుదే అన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మాట్లాడుతూ శ్రీరామ అంటే సమస్త శుభాలు కలుగుతాయి. అలాంటి నామాన్ని నేడు విశ్వ వ్యాప్తం చేస్తున్న రామకోటి రామరాజు ధన్యుడన్నాడు.రామాలయ అధ్యక్షులు కాల్వ శ్రీధర్ రావు మాట్లాడుతూ సుందరమైన రామాలయం నిర్మాణానికి కృషి చేస్తున్నన్నారు. 1కోటి16లక్షల లిఖిత రామనామాలు అందించడం సంతోషమన్నారు. ఈ కార్యక్రమంలో రామాలయం నిర్వాహకులు ఎన్సీ శ్రీను, గోలి సంతోష్, తూము శ్రీధర్, మరియు రమేష్, బలరాం, హరిచంద్రం పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *