దౌల్తాబాద్ మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ఆదివారం రోజున ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. మాచినపల్లి గ్రామంలో ముదిరాజ్ భవన నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేశారు. తిరుమలాపూర్ గ్రామంలో పర్యటించి గౌడ్ అన్నలు ధరించే ముస్తాదార్ అవతారం ఎత్తారు. అనంతరం గౌడ సంఘ భవన నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల మంజూరు చేశారు ,ముదిరాజ్ భవనానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేశారు. మెదక్ పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ రైతు బాగుంటే రాజ్యం బాగుంటదని నినాదంతో ఈరోజు తెలంగాణలో కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లతో ప్రతి గ్రామలలో చెరువులను, కుంటలను నింపడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం సబండవర్ణాలకు అభివృద్ధి పలాలు అందుతున్నాయని దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ ఫలాలు అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ మండల పార్టీ అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్ ,పిఎసిఎల్ చైర్మన్ వెంకట్ రెడ్డి ,వైస్ ఎంపీపీ అల్లిశేఖర రెడ్డి ,గ్రామ సర్పంచులు భాగ్య,సుగుణ,ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బండారు దేవేందర్, ఎంపీటీసీలు మల్లేశం, తిరుపతి , మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పడకంటి శ్రీనివాస్ గుప్తా,ఇప్ప దయాకర్ , టిఆర్ఎస్వి నాయకులు ఖలియుద్దీన్, వివిధ గ్రామాల సర్పంచులు ,పార్టీ కార్యకర్తలు ,గ్రామ గౌడ సంఘ నాయకులు ముదిరాజ్ సంఘం నాయకులు, గ్రామ కమిటీ అధ్యక్షులు రమేష్ గౌడ్ ,మాజీ సర్పంచ్ యాదవ రెడ్డి ,డైరెక్టర్ సత్యనారాయణ , గ్రామ గౌడ సంఘం అధ్యక్షుడు గాల గౌడ్, అంగడి రాజయ్య, బోటుక సత్తయ్య, సంభాగ యాదగిరి, గడ్డం స్వామి, గడ్డమీది లక్ష్మీనారాయణ ,పడాల లచ్చయ్య, సాకలి మల్లేశం, నీరుడి రామచంద్రం, నాగరాజు, నీరుడి నర్సింలు, కుమ్మరి కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.




