రాజన్న సిరిసిల్ల: తెలుగు న్యూస్24/7 ఫిబ్రవరి 19: ముస్తాబాద్ మండలం నామాపూర్, అవునూర్ గ్రామాల్లోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి శనివారం క్షేత్ర స్థాయిలో సందర్శించారు. ఉపాధ్యాయులను, సిబ్బందిని అడిగి వసతులు, సౌకర్యాలపై ఆరా తీశారు. మధ్యాహ్న భోజన తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల మౌళిక వసతులు కల్పించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మరమ్మత్తులతో పాటు, విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించడం జరుగుతుందని అన్నారు. నిర్వహణ కమిటీలతో సమావేశాలు నిర్వహించి, ఆయా పాఠశాలల్లో ఏయే పనులు చేపట్టాల్సి వస్తుందో క్షుణ్ణంగా అంచనా వేసుకుని, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో, ఏజెన్సీ నిర్వాహకులతో చర్చించాలని అన్నారు. ప్రతీ పాఠశాలకు రెండు జాయింట్ బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సందర్శనలో కలెక్టర్ జిల్లా విద్యాధికారి డా. రాధాకిషన్, తదితరులు పాల్గొన్నారు.





