ముసాబాద్, మార్చ్ 8 (24/7న్యూస్ ప్రతినిధి): అఖిలభారత రజక సంఘం సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు భాను మాట్లాడుతు తెలంగాణ వీరనారి రజకజాతి పోరాట యోధురాలు చాకలి ఐలమ్మకు స్థిరస్థాయిగా నిలబడిన పేరును తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల దినోత్సవం సందర్భంగా కోటి ఉమెన్స్ యూనివర్సిటీకి శంకుస్థాపనచేసి చాకలి ఐలమ్మ నామ కారణం చేయడం చారిత్రాత్మకత ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు అందరికి మా రజక జాతి తరుపున అఖిల భారత రజక సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజులలో రజక జాతి అభ్యున్నతి కోసం రజకులకు ఈ ప్రభుత్వం తోడ్పడాలని కోరారు.
