సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 19వ వార్డులో ఈరోజు సిసి రోడ్ పనుల ప్రారంభం.
ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రి హరీష్ రావుల ప్రత్యేక కృషితో 19వ వార్డులో గడ నిధుల ద్వారా 60 లక్షలతో సిసి రోడ్డు పనులు వేయడం జరుగుతుందని కౌన్సిలర్ గుంటుకు శిరీష రాజు అన్నారు. త్వరలోనే అన్ని విధుల్లో సీసీ రోడ్డు పనులు ప్రారంభిస్తామన్నారు. గజ్వేల్ నుంచి సీఎం కెసిఆర్ ప్రాతినిధ్యం వహించడంతో అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు గజ్వేల్ దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. కార్యక్రమంలో భారసా పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా నాయకులు పులి బలచంద్రం, సాయి, అనసూయ, గుంటుకు శాంతి, భాగ్య, సంధ్య, నరసింహారెడ్డి, ఆశ, సుధాకర్, గోపి, శ్రావణ్, తలారి వెంకటి, అంజయ్య , రాజు, కాలనీవాసులు,తదితరులు పాల్గొన్నారు
